ఏసు జీవితం ఆదర్శప్రాయం
ఒంగోలు సిటీ: ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని రాజ్యసభ సభ్యుడు వైవీ.సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్ ఆకాంక్షించారు. ప్రేమ, కరుణ, దయ, జాలి, క్షమాగుణాలను కలిగిన ఏసుక్రీస్తు జీవితం సర్వమానవాళికి ఆదర్శప్రాయమన్నారు.
ఏసు జీవితం ఆదర్శప్రాయం


