
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
● జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి
ఒంగోలు సిటీ: ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమం ఒంగోలులోని మెడికల్ కాలేజీలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి వరకుమార్, కోశాధికారి రంగారెడ్డి ఒంగోలు పట్టణ అధ్యక్షులు మోటా శ్రీనివాసరావు తాలూకా అధ్యక్షుడు సురేష్ బాబు, ప్రసన్న, ఏసురత్నం, శ్రీనివాసులు ,అంకబాబు లతోపాటు మెడికల్ కళాశాల ఉద్యోగులు విజయ లక్ష్మీ గారు, శ్రీనివాస యాదవ్, బాబురావు ,రాజేష్, కార్తీక్, దినకర్, ప్రభావతి, చాందిని ,రమేష్ బాబు, లావణ్య, పద్మలత, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూంలో బుధవారం నుంచి కళా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్ తెలిపారు. మంగళవారం పీవీఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో కళా ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ను విజయవాడ బుక్ ఫెస్టివల్ అధ్యక్షుడు మనోహర్ నాయుడు, ప్రజానాట్యమండలి కార్యదర్శి చిన్నం పెంచలయ్యతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం చంద్రా నాయక్ మాట్లాడుతూ...ఈ నెల 24వ తేదీ వరకు కళా ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని కళారూపాలుగా ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఈ కళా ఉత్సవాలలో ప్రముఖ సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, బాబ్జీ, సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, గోరటి వెంకన్న, జయరాజ్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.