
చీమకుర్తిలో టీడీపీ నేతల కక్ష సాధింపు
చీమకుర్తి: నిరుపేద కుటుంబంపై అధికారులు జులుం ప్రదర్శించారు. చీమకుర్తి శివారులోని గరికమిట్టలో నిరుపేదలైన మారం వెంకారెడ్డి, బాయమ్మ నిర్మించుకుంటున్న ఇంటి పునాదులను మంగళవారం పోలీస్ బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగించారు. అధికార టీడీపీ నాయకుల ప్రోద్బలంతో మున్సిపల్ అధికారులు నిర్ధాక్షిణ్యంగా ఇంటి పునాదులను జేసీబీతో పెకలించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిర్మించుకుంటున్న ఇంటి పరిసరాల్లో గత 12 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నామని, 6 నెలల క్రితం ఇంటిని నిర్మించుకునేందుకు పునాదులు వేసుకున్నామని బాధితులు తెలిపారు. కాగా మున్సిపల్ అధికారుల తీరుపై స్థానిక వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ గంగిరెడ్డి ఇందిర సుందరరామిరెడ్డి మండిపడ్డారు. చీమకుర్తిలో వాగు పోరంబోకు స్థలాల్లో వందలాది మంది ఇళ్లు నిర్మించుకున్నారని, వాటి జోలికి వెళ్లకుండా గరికమిట్టలో నిరుపేద కుటుంబం చిన్న ఇల్లు కట్టుకుంటుంటే కూల్చేయడం ఏమిటని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలే గుణపాఠం చెబుతారని టీడీపీ నేతలను హెచ్చరించారు.
నిరుపేద కుటుంబంపైకి అధికారులను ఉసిగొల్పి రాక్షసానందం
జేసీబీతో ఇంటి పునాదులు పెకలించిన వైనం
మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్

చీమకుర్తిలో టీడీపీ నేతల కక్ష సాధింపు