
త్యాగధనుల జీవితం ఆదర్శనీయం
ఒంగోలు: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన త్యాగధనుల జీవితాలు అందరికీ ఆదర్శమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కోర్టు ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ త్యాగధనుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, పందిరి లలిత, కానుగుల శైలజ, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ రామకృష్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలోని గ్రంథాలయం వద్ద జాతీయ జెండాను ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, కార్యదర్శి జగజ్జీవన్‌రావు ఆవిష్కరించారు.
జెండా వందనం చేస్తున్న జిల్లా జడ్జి భారతి