
కారు, మోటార్ సైకిల్ ఢీ
పెద్దదోర్నాల: ఎదురుగా వస్తున్న కారు, మోటారు సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూల్ గుంటూరు జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో రామచంద్రకోటకు చెందిన బీజెపీ నాయకుడు అంబటి అల్లూరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళఇతే.. మండల కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై రామచంద్రకోటకు వెళ్తున్న అల్లూరెడ్డిని మార్కాపురం నుంచి దోర్నాల వైపుకు వస్తున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయిన అల్లూరెడ్డిని మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం మార్కాపురం ఏరియా వైధ్యశాలకు తరలించారు.