
ఎమ్మెల్యే కళ్లలో ఆనందం కోసం..
కొత్తపట్నం: రెడ్ బుక్ రాజ్యాంగం జడలు విప్పుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దరిమిలా వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. బుధవారం కొత్తపట్నం సమీపంలోని నల్లూరి గార్డెన్‌లో టీడీపీ నేత కుమారుడి వివాహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వస్తున్నాడని ఆ పార్టీ నేతలు పంచాయతీ కార్యదర్శితో కలిసి ఓవరాక్షన్ చేయడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చంద్రబాబు మోసపూరిత హామీలపై కొత్తపట్నం ప్రధాన రహదారిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం ఆ పార్టీ నేతల ఆగ్రహానికి కారణమైంది. సొంత ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను కూడా తొలగించాల్సిందేనని, తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉందని కార్యదర్శి చెప్పడంతో వైఎస్సార్ సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. శ్మశానంలో ఫెన్సింగ్ రాళ్లకు ప్రజల సొమ్ముతో పసుపు రంగు ఎలా వేశారని ప్రశ్నించారు. శ్రీఅన్ని పార్టీల వారు ఫ్లెక్సీలు కట్టుకుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు కొత్త సంస్కృతి తీసుకొస్తున్నారశ్రీని నిలదీశారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నా కార్యదర్శి మాత్రం బలవంతంగా ఫ్లెక్సీలు తొలగించారు.
కొత్తపట్నంలో పెళ్లికి ఎమ్మెల్యే దామచర్ల వస్తున్నాడని వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల తొలగింపు
ఇళ్లపై కట్టిన ఫ్లెక్సీలు సైతం పీకేయడంపై వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం

ఎమ్మెల్యే కళ్లలో ఆనందం కోసం..