
కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపాలి
దర్శి: భారతదేశ చరిత్రలో ఎప్పుడూ...ఎక్కడా..ఇంత దారుణమైన ఎన్నికల నిర్వహణ జరగలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ బయట నుంచి దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ తెగబడ్డారన్నారు. రిగ్గింగ్ చేస్తుంటే పోలీసులే సహకరించడం దారుణంగా ఉందన్నారు. ఓటర్లను బూత్‌లకు వెళ్లనివ్వకుండా వాళ్లే ఓట్లు వేసుకుంటే ఎన్నికలు నిర్వహించడం ఎందుకు ..? ఎన్నికల కమిషన్ తీరు దారుణంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓటరు స్లిప్పులు లాక్కుని టీడీపీ గూండాలు వారిని తరిమి కొడుతుంటే పోలీసులు గుడ్లప్పగించి చూశారన్నారు. దొంగ ఓట్లేసుకునే వారికి పోలీసులు సహకరించడం నిస్సిగ్గుగా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ పూర్తిగా ఖూనీ చేసిందని మండిపడ్డారు. ఓట్లేయించుకోనివ్వండని పోలీసుల కాళ్లు పట్టుకోవడం ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్దపులి దాడిలో గేదె మృతి
గిద్దలూరు రూరల్: మండలంలోని వెళ్లుపల్లె అటవీప్రాంతంలో పెద్దపులి దాడి చేయడంతో గేదె మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. మోడీ రంగస్వామి అనే రైతుకు చెందిన గేదైపె పెద్ద పులి దాడి చేయడంతో అది చనిపోయిందని రైతు వాపోయాడు. రూ.80 వేలు విలువచేసే తన గేదె మృతి చెందిందని తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. పులి పాదాలను సమీపంలో ప్రాంతంలో అటవీ సిబ్బంది గుర్తించారు.

కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపాలి