
సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
● ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి
ఒంగోలు సిటీ: పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గం చేపట్టిన ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమం ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రంగారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, విద్యాశాఖ సిబ్బంది శివశంకర్, వేణు, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.