
నిబద్ధతతో విధులు నిర్వర్తించండి
ఒంగోలు టౌన్: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో పదోన్నతి పొందిన ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆ శాఖ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ సూచించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ 99 మంది ఎస్సైలుగా, ఒకరు సీఐగా, ఇద్దరు ఏఈఎస్‌గా పదోన్నతి పొందారు. వీరికి మే 15 నుంచి మూడు నెలలపాటు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ ముగింపు సందర్భంగా మంగళవారం వీడ్కోలు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. పదోన్నతి హోదాతోపాటు బాధ్యతలను కూడా పెంచుతుందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని సూచిస్తూ అభినందనలు తెలిపారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్ జీఆర్ రాధిక, జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ దయా సాగర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ డి.లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్‌దేవ్‌శర్మ