
ప్రకాశం
న్యూస్‌రీల్
7
విద్యుత్ అధికారులనిర్లక్ష్యానికి యువకుడు బలి
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న ఘటన దర్శి పట్టణం సందువారిపాలెం వద్ద సోమవారం జరిగింది.
కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న జిల్లా రైతాంగంపై ఎరువుల ధరల పిడుగు పడింది. గిట్టుబాటు ధర లభించక సాగుభారంగా మారిన పరిస్థితుల్లో పెరిగిన ఎరువుల ధరలు గుదిబండగా మారనున్నాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పంట దిగుబడి సైతం భారీగా పడిపోయింది. ఖరీఫ్‌లోనైనా గట్టెక్కుదామని ఆశపడిన రైతుల్లో ఎరువుల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కంపెనీని బట్టి బస్తాకు రూ.100 నుంచి రూ.250 వరకూ ధర పెరిగింది. ఇలా అయితే సాగుకష్టమంటూ రైతులు వాపోతున్నారు.
ఎరువుల ధరలు తగ్గించాలి
ఇప్పటికే దిగుబడులు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఎరువుల ధరలు పెంచడంతో వ్యవసాయం చేయాలంటే భారంగా ఉంది. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి సాగుకు అవసరమయ్యే ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం. పత్తి సాగు చేసినప్పటికీ వర్షాలు లేకపోవడంతో వాడుముఖం పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ధరలు పెంచడం రైతులకు భారమే.
– టీ రామిరెడ్డి, రైతు, కొట్టాలపల్లి, మార్కాపురం మండలం
ఎరువుల కొరత లేదు
జిల్లాలో ఇప్పటి వరకు ఎరువుల కొరత లేదు. రైతులకు అవసరమైన ఎరువులను పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్నాయి. అవసరమైతే ఇంకా తెప్పిస్తాం. యూరియా 2,811 మెట్రిక్ టన్నులు అవసరమని గుర్తించి 5625 మెట్రిక్ టన్నులకు ప్లాన్ చేశాం. డీఏపీ 1639, ఎన్‌పీకేఎస్ 5591 టన్నులు అవసరమని గుర్తించి అందుకు తగిన ఏర్పాట్లు చేశాం. జిల్లాలో ఇప్పటికే వివిధ రకాల ఎరువులకు సంబంధించి 29,626 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
– శ్రీనివాసరావు, జేడీఏ, ఒంగోలు

ప్రకాశం

ప్రకాశం

ప్రకాశం

ప్రకాశం