
స.హ చట్టంపై అవగాహన ఉండాలి
● జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ వరలక్ష్మి
ఒంగోలు సబర్బన్: ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సహాయ మార్కెటింగ్ సంచాలకులు ఎం.వరలక్ష్మి సూచించారు. ఈ మేరకు పాత గుంటూరు రోడ్డులోని జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులకు, ఏడీ కార్యాలయంలోని సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులు పాల్గొన్నారు.
బ్లాక్‌బర్లీ అదనపు కొనుగోలుకు వినతి
● సమావేశంలో మాట్లాడుతున్న జేసీ గోపాలకృష్ణ
ఒంగోలు సబర్బన్: జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుకు అదనపు కేటాయింపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో జిల్లా స్థాయి పొగాకు కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలను ఆమోదించారు. కమిటీలో ఆమోదించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 930 మెట్రిక్ టన్నుల పొగాకును జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసి వెంటనే ఆమోదించాలని కమిటీని ఆదేశించారు. అవసరమైన చోట రీ స్టాకింగ్ అండ్ రీ క్లాసిఫికేషన్ చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లాకు పొగాకు కొనుగోలుకు అదనపు కేటాయింపులు కావాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపించేందుకు డీఎల్‌పీసీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ డీఎం కాకర్ల హరికృష్ణ పాల్గొన్నారు.
జిల్లా వాలీబాల్ జట్టు ఎంపిక
ఒంగోలు సిటీ: రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టును బుధవారం త్రోవగుంట జెడ్పీ హైస్కూల్లో ఎంపిక చేసినట్లు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ ఎండీ హజీరాబేగం తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి వంద మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ఎంపికలో ప్రతిభ కనబరిచిన ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈనెల 18న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. బాలుర జట్టులో ఏ రాకేష్ (ఏ.పీ.ఎంజీబీ బీసీ వెల్ఫేర్ వేటపాలెం), బీ రాజేష్ (జెడ్పీహెచ్‌ఎస్ చాకిచెర్ల), బీ సెల్వరాజ్ (జెడ్పీహెచ్‌ఎస్ త్రోవగుంట), వీ మహేష్ (చాకిచెర్ల), డీ రవివర్మ (జెడ్పీహెచ్‌ఎస్ పాకల), సీహెచ్ హేమంత్ (పాకల), ఇద్దరిని స్టాండ్ బైగా ఆర్ కార్తికేయ (ఆలకూరపాడు), ఎన్ సాయి వినేష్ (ఆలకూరపాడు) ఎంపిక చేసినట్లు తెలిపారు. బాలికల జట్టులో వీ నందన (జెడ్పీహెచ్‌ఎస్ ఆలకూరపాడు), పీ సుచరిత (ఆలకూరపాడు), కే జెస్సికా (ఆలకూరపాడు), టీ రిషిత ప్రియ (గవర్నమెంట్ హైస్కూల్ టంగుటూరు), కే గాయత్రి (జెడ్పీహెచ్‌ఎస్ గరల్స్ వేటపాలెం), ఏ పూజిత (జెడ్పీహెచ్‌ఎస్ బండ్లమూడి), స్టాండ్ బైగా ఐ వెంకట ప్రణతి (జెడ్పీహెచ్‌ఎస్ బండ్లమూడి) ఎంపికయ్యారు.
ట్యాక్స్ కన్సల్టెంట్స్ జిల్లా కమిటీ ఏకగ్రీవం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. స్థానిక సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో బుధవారం జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా కమిటీ అధ్యక్షుడుగా దివి రోశయ్య, కార్యదర్శిగా సీహెచ్‌ఏబీఎస్ నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ కోశాధికారిగా కేవీ.సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్‌గా వై.వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీలుగా కే.భార్గవ ప్రతాప్, వీఎస్.రాఘవేంద్ర కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.మణికంఠ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఏ.రమేష్ రెడ్డి, ఆర్.తేజ సూర్య కుమార్‌లు ఎన్నికై న వారిలో ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికై న కమిటీ చేత రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి నెల్లూరు డివిజన్ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వై.కిరణ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఎం.సత్య ప్రకాష్, డిప్యూటీ డైరెక్టర్ డీఎంజీఓ టి.రాజశేఖర్, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ రావులు పాల్గొన్నారు.

స.హ చట్టంపై అవగాహన ఉండాలి

స.హ చట్టంపై అవగాహన ఉండాలి