
No Headline
రాచర్ల: మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానం సమీపంలోని నీటిగుండం వద్ద గుండ్లకమ్మవాగు ఉధృతంగా పరుగులు పెడుతోంది. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా లక్షమ్మవనం సమీపంలోని సిమెంటు రోడ్డుపై నుంచి గుండ్లకమ్మవాగు సోమవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎత్తయిన కొండల నుంచి వేగంగా నీటి గుండంలోకి జారుతున్న జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దేవస్థానం సమీపంలోని నీటిగుండం వద్దకు పర్యాటకులకు అనుమతించకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు.