
సౌత్ ఇండియా రోల్‌బాల్ టోర్నమెంట్‌కు ఇద్దరు ఎంపిక
ఒంగోలు: సౌత్ ఇండియా రోల్‌బాల్ టోర్నమెంట్‌కు ఇద్దరు చిన్నారులు ఎంపికై నట్లు ప్రకాశం జిల్లా రోల్‌బాల్ ఇన్‌చార్జి ఏ. అనీల్‌కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7 నుంచి 10 వరకు తణుకులో జరిగిన రాష్ట్ర స్థాయి క్యాంప్‌నకు ఎంపికై న వీరు అక్కడ అత్యంత ప్రతిభ కనబరిచి అండర్ 11 బాలుర విభాగంలో పిక్కిలి వరుణ్, బాలికల విభాగంలో ప్రత్తిపాటి సిదీక్షలు సౌత్ ఇండియా టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. వీరు సెప్టెంబర్ 6, 7 తేదీల్లో చైన్నెలో జరగనున్న సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొంటారు.
ఎంపికై న ఇద్దరు చిన్నారులు ప్రకాశం జిల్లాకు చెందిన వారు కావడం తమకు మరింత సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంటూ ఇద్దరు చిన్నారులను, కోచ్ గుర్రం అనీల్‌కుమార్‌లను ఆయన అభినందించారు.

సౌత్ ఇండియా రోల్‌బాల్ టోర్నమెంట్‌కు ఇద్దరు ఎంపిక