
ప్రభుత్వాన్ని నిలదీయండి
హామీల అమలుపై
● వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున
చీమకుర్తి రూరల్: ఓట్ల కోసం మభ్యపెట్టేందుకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును, టీడీపీ నాయకులను నిలదీయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. మండలంలోని గోనుగుంట మొవ్వవారిపాలెం, కేవీ పాలెం గ్రామాల్లో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీశ్రీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో మేరుగు నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారని గుర్తు చేశారు. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం పూర్తిగా దిగజారినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న సంకల్పంతో అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును పేదల బ్యాంక్ ఖాతాలకు జమ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అయితే ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదైనా పింఛన్ల సంఖ్యలో భారీగా కోత పెట్టి పెంచడంతో పాటు, అరకొరగా తల్లికి వందనం పథకాన్ని మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకుందన్నారు. ఇచ్చిన పథకాల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించేలా ప్రభుత్వం తయారైందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు, శ్రీధర్ల శేషు, యూత్ అధ్యక్షుడు వెంగరెడ్డి, జిల్లా కార్యదర్శి ఓబుల్ రెడ్డి, నల్లూరి చంద్ర, తన్నీరు శ్రీనివాసరావు, బొడ్డు కోటేశ్వరరావు, ఉప్పలపాటి వెంకటరావు, ఎర్రగుంట్ల మోహన్, వసంతరావు, ఏలూరు సురేష్, పేరాబత్తిన పేరయ్య, వాకా కోటిరెడ్డి, కందుల డేనియల్, పాటిబండ్ల గంగయ్య, సంతోష్, మగులూరి ఇమ్మనేలు, బొడ్డపాటి హరిబాబు మండలంలోని పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.