
ఇంటర్ విద్యలో సుబ్బారావు సేవలు ఎనలేనివి
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యలో వివిధ హోదాల్లో సముచిత సేవలందించి వాటికి వన్నె తెచ్చిన వ్యక్తి వంగపల్లి వెంకట సుబ్బారావు అని ఇంటర్ విద్య ఆర్‌జేడీ జె.పద్మ, ఇంటర్ బోర్డు సీఓఈ ఎ.సైమన్ విక్టర్, ఓఎస్డీ వి.రమేశ్ అన్నారు. ఇంటర్మీడియెట్ విద్యామండలి పరీక్షల నియంత్రణ అధికారిగా పనిచేస్తూ, నెల్లూరు డీఐఈఓ గా జూలై 31న ఉద్యోగ విరమణ చేసిన సుబ్బారావుకు ఆదివారం ఒంగోలు ఏకేవీకే జూనియర్ కళాశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు అతిథులుగా మాట్లాడారు. లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా, ప్రకాశం జిల్లా ఆర్‌ఐఓగా, గుంటూరు ఆర్‌జేడీగా, పరీక్షల నియంత్రణ అధికారిగా, నెల్లూరు జిల్లా ఇంటర్ విద్య అధికారిగా వివిధ హోదాల్లో ఆయన అందించిన సేవలు నిరుపమానం అన్నారు. ఇంటర్ విద్య సంస్కరణల్లో ఆయన కీలక భూమిక పోషించారని ప్రశంసించారు. ఆయన పనితీరు అందరికీ మార్గదర్శకం అన్నారు. సుబ్బారావు, భారతి దంపతులను ఘనంగా సన్మానించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి కే ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్రంలోని డీఐఈఓలు, ఆర్‌ఐఓలు, ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయంలో చదవడం మాకిష్టం
ఒంగోలు మెట్రో: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులకు నెలలో రెండో ఆదివారం పుస్తక సమీక్ష మంచికంటి వెంకటేశ్వర రెడ్డి నిర్వహించారు. జాలాది మోహన్బాబు విద్యార్థులచే పుస్తక పఠనం చేయించారు. నలుగురు విద్యార్థులకు జిల్లా గ్రంథాలయంలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ పెట్టి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ కాళహస్తి డీసీఎల్ సిబ్బంది, డీ సందీప్, గోవిందమ్మ పాల్గొన్నారు.

ఇంటర్ విద్యలో సుబ్బారావు సేవలు ఎనలేనివి