
నేత్రపర్వంగా శ్రీనివాసుని కళ్యాణం
● ఘనంగా ముగిసిన వైఖానస సర్వసభ్య సమావేశం
ఒంగోలు మెట్రో: విఖనసాచార్యుల జయంతి మహోత్సవాన్ని ఒంగోలులోని వైఖానస భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వైఖానస సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విఖనస జయంతి మహోత్సవంలో భాగంగా ఆదివారం ప్రాంగణంలో టీటీడీ పండితుడు పరాంకుశం కృష్ణసాయి భట్టర్ ఆధ్వర్యంలో విశేష క్రతువులను ద్విసహస్ర కళ్యాణ చక్రవర్తి, త్రినాథ చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. డాక్టర్ పి.హరిబాబు బృందం ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పరాంకుశం కేశవాచార్యులు, గౌరవాధ్యక్షుడు గంజాం శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి పి.ఆత్రేయ, కోశాధికారి ఉపాళ్ల రాంబాబు, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మూర్తి, గౌరవ సలహాదారు యం.ఎ.శేషాచార్యులు, కార్యవర్గ సభ్యులు దివి కళ్యాణ చక్రవర్తి, రమణదీక్షితులు. దివి కస్తూరి రంగాచార్యులతో పాటుగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పలువురు వైఖానస పండితులు పాల్గొన్నారు.