
ఆదివాసీ చట్టాలు పట్టించుకోని ప్రభుత్వం
ఒంగోలు సిటీ: ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కి అటవీ భూములన్నింటినీ కూటమి ప్రభుత్వం కార్పొరేట్‌లకు ధారాదత్తం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కొమరం భీమ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకోవడం సంతోషదాయకమన్నారు. ప్రకృతికి దగ్గరగా బతుకుతున్న గిరిజనులు తమ జీవనోపాధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారన్నారు. ఆదివాసీల హక్కులు కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9వ తేదీని ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్) వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్) బొట్ల రామారావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, ఇంటెలెక్చువల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు దేవరపల్లి అంజిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేళం మదు, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టరు కె.మల్లిఖార్జునరావు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పేరంప్రసన్న, ఆనం శ్రీను, పిగిలి శ్రీను, గాలేటి వెంకటేశ్వర్లు, కత్తి రవి, బాపట్ల లక్ష్మయ్య, జి.హరి, కనపర్తి గోవిందమ్మ, మేరీకుమారి, వాణి, సయ్యద్ అప్సర్, లక్ష్మికాంతం, రమణమ్మ, అమర్, బాషా, పొట్లూరి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవిబాబు