
ఆధ్యాత్మిక పరిమళం
శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సౌభాగ్యాన్ని, సిరిసంపదలను ప్రసాదించే వరలక్ష్మీ అమ్మవారిని ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చుకున్నారు. మరోవైపు చారిత్రక కంభం చెరువు కట్టపై తేరాతేజి (గరికతొక్కుడు) పండుగను ముస్లింలు వైభవంగా జరుపుకున్నారు. నూతన వధూవరులు కంభం చెరువులో పెళ్లినాటి దండలు వదిలి తమ మొక్కులు తీర్చుకున్నారు. కట్టపై ఉన్న దీనాషావలి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఆధ్యాత్మిక పరిమళం

ఆధ్యాత్మిక పరిమళం