కాలేజీ బస్సు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

కాలేజీ బస్సు దగ్ధం

Mar 20 2025 1:15 AM | Updated on Mar 20 2025 1:16 AM

పొన్నలూరు: పార్కింగ్‌లో ఉన్న కళాశాల బస్సులో వైర్లు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ సంఘటన పొన్నలూరు మండలంలోని చెరువుకొమ్ముపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చెరువుకొమ్ముపాలెం జెడ్పీ హైస్కూల్‌ పదో తరగతి విద్యార్థులను కందుకూరులోని ఓ ప్రైవేట్‌ కాలేజీ బస్సులో పొన్నలూరు జూనియర్‌ కళాశాలలో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బస్సు విద్యార్థులతో సహా చెరువుకొమ్ముపాలెం చేరుకుంది. విద్యార్థులు దిగిపోయిన తర్వాత డ్రైవర్‌ పాఠశాల సమీపంలో బస్సును నిలిపి భోజనం చేసేందుకు కె.అగ్రహరం వెళ్లారు. ఇంతలోనే బస్సులో వైర్లు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు గమనించి మంటలను అదుపు చేసి, అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. బస్సు షార్ట్‌ సర్క్యూట్‌తోనే దగ్ధమైందా లేక ఎవరైనా ఆకతాయిలు నిప్పుపెట్టారా? అని విచారణలో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement