15న జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

15న జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు

Mar 13 2025 11:35 AM | Updated on Mar 13 2025 11:31 AM

గిద్దలూరు రూరల్‌: మండలంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 15వ తేదీ జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకుడు ఈదుల పాండురంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో గెలుపొందిన రెండు పండ్ల విభాగం ఎడ్లకు మొదటి నుంచి నాలుగు బహుమతులు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందిస్తారన్నారు. 16వ తేదీ సీనియర్స్‌ విభాగం ఎడ్ల పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి నుంచి ఆరు బహుమతులు వరుసగా రూ.1,11,111, రూ.77.777, రూ.55,555, రూ.33,333, రూ.22,222, రూ.11,111లను అందిస్తారని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 9866432566 సెల్‌ నంబరును సంప్రదించాల్సిందిగా వారు కోరారు.

బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువు

ఒంగోలు టౌన్‌: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. బుధవారం నగరంలోని ఎల్బీజీ భవనంలో ఐద్వా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నాయకురాలు వై. అంజనీ దేవి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి ప్రభుత్వాలే మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. మహిళలు మరింతగా ఐక్య ఉద్యమాలు చేయాలని కోరారు. దేశంలోని మహిళల హక్కుల కోసం ఐద్వా అనేక పోరాటాలు చేసిందని, ఐద్వా పోరాటాల ఫలితంగా నేక చట్టాలు, హక్కులను సాధించుకుందని చెప్పారు. రాజ్యాంగం సీ్త్ర, పురుషులకు సమాన హక్కులు ఇచ్చిందని, బీజేపీ పాలనలో మహిళల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్‌ నాగూర్‌ బి, రాజ్యలక్ష్మి, ఆదిలక్ష్మి, రాజేశ్వరి, పెద్ద గోవిందమ్మ, ఇంద్రజ్యోతి పాల్గొన్నారు.

నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల పునఃపరిశీలన

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు సిటీ: నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునః పరిశీలన ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాల కృష్ణతో కలసి బుధవారం ఉదయం జిల్లాలో జరుగుతున్న నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునఃపరిశీలన ప్రక్రియ, పురోగతిపై మండలాల వారీగా రెవెన్యూ అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ అయ్యాయా లేదా పూర్తిస్థాయిలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పునః పరిశీలన జరగాలన్నారు. ఈ ప్రక్రియపై సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ద సారించాలన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సహదీత్‌ వెంకట త్రివినాగ్‌, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌ రెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్‌, సత్యనారాయణ, తహశీల్దార్లు, కలెక్టరేట్‌ ల్యాండ్‌ సెక్షన్‌ అధికారులు పాల్గొన్నారు.

15న జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు 1
1/1

15న జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement