మత్స్యకారుల ఉపాధి మెరుగుపరిచేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల ఉపాధి మెరుగుపరిచేలా చర్యలు

Nov 22 2024 1:29 AM | Updated on Nov 22 2024 1:38 AM

ఒంగోలు అర్బన్‌: మత్స్యకారుల సంక్షేమంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం ప్రకాశం భవనంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ఎంపీ, కలెక్టర్‌తో పాటు మేయర్‌ సుజాత, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. దీనిలో వక్తలు మాట్లాడుతూ ఫిషింగ్‌ హార్బర్‌లు ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. చేపల ఉత్పత్తిలో దేశంలో 29.1 శాతం వాటాతో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ విజయవాడలో వచ్చిన వరదల సమయంలో చెప్పిన వెంటన 35 బోట్లతో 75 మంది మత్స్యకారులు విజయవాడకు వెళ్లి వారంపాటు వరద సహాయక చర్యల్లో పాల్గొనటం అభినందనీయమన్నారు. వారి సహకారం మరువలేనిదని అదే స్ఫూర్తితో ఎప్పుడూ ప్రజలకు సేవలు అవసరమైనా అందించాలని కోరారు. తమిళనాడు నుంచి వస్తున్న సోనా బోట్ల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొత్తపట్నం, పాకల బీచ్‌లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. వరదల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న మత్స్యకారులను సత్కరించారు. కార్యక్రమంలో మత్స్యకారులతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తుఫాన్‌ బాధితులను ఆదుకోవడంలో మత్స్యకారుల సహకారం మరువలేనిది మత్స్యకార దినోత్సవంలో ఎంపీ మాగుంట, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement