
జగనన్న ఆదుకున్నారు
మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. అనుకోకుండా మా ఆయన పొలం పనుల కోసం అప్పులు చేశాడు. కానీ అవి తీర్చలేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో జగనన్న ప్రభుత్వం రైతు ఆత్మహత్య పరిహారం కింద రూ.7 లక్షలు ఇచ్చింది. ఆ డబ్బులతో కొన్ని అప్పులు తీర్చి మిగిలిన డబ్బులతో మా అబ్బాయిని చదివించుకుంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాను. మా అబ్బాయికి అమ్మఒడి కూడా వస్తోంది. జగనన్న విద్యాకానుకను ఇచ్చారు. నాకు పింఛన్ రూ.3000 వస్తుంది. ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్నాం.
– జి.సీతారాములమ్మ, ఉమ్మడివరం, పుల్లలచెరువు మండలం