● ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ మలికాగర్గ్
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ మలికాగర్గ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు టూ టౌన్‌లో పనిచేస్తున్న వి.సాంబ శివయ్యను పొన్నలూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా యర్రగొండపాలెంలో పనిచేస్తున్న జీ.కోటయ్యను జిల్లా వీఆర్‌కు పిలిపించారు. జిల్లా వీఆర్‌లో ఉన్న ఎంవి.రాజేష్‌ను యర్రగొండపాలెం ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే సంబంధిత డీఎస్పీలు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు.