రోడ్డుపక్కన పడిన ఆటో
● ఇద్దరికి తీవ్రగాయాలు
బేస్తవారిపేట: ఆటోను కారు ఢీకొట్టడంతో ఆటోలోని ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన బేస్తవారిపేట మండలంలోని చింతలపాలెం సమీపంలో కడప–తోకపల్లె హైవేపై ఆదివారం జరిగింది. కంభం నుంచి పడగాల వాసు (ఆటో డ్రైవర్), దూదేకుల చిన్న మౌలాలి ఆటోలో బేస్తవారిపేట వెళ్తున్నారు. బేస్తవారిపేట వెళ్తూ వెనుకగా వచ్చిన కారు.. డ్రైవర్ మద్యం మత్తు కారణంగా ఆటోను ఢీకొట్టింది. ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన మార్జిన్‌లో ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ వాసు కాలు విరగ్గా, చిన్నమౌలాలి తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిన్నమౌలాలిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. స్థానిక ఎస్సై బీ నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


