
రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు
ఒంగోలు అర్బన్: జిల్లాలో ఓటర్ల జాబితా పరిశీలన పారదర్శకంగా జరుగుతుందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ప్రకాశం భవనంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ కేంద్రాల మార్పులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గురించి వివరించారు. 8 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు జరిగిన ఓటరు లిస్టు పరిశీలన, ఫారం–6, 7, 8, 6బీపై జరిగిన ప్రక్రియలను వివరించారు. జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, అందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ శ్రీలత, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు కాలేషాబేగ్, రాజశేఖర్, సత్యం, ఎస్‌కే రసూల్, చౌదరి తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు