● ఆర్డీవో విశ్వేశ్వరరావు
ఒంగోలు అర్బన్: 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని అందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలని డీఆర్‌ఓ విశ్వేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. దీనిలో ఆర్డీవో మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు పరిశీలన పక్కాగా నిర్వహిస్తున్నామన్నారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేయని వారు ఆధార్ లేదా నిర్దేశించిన 16 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానితో ఓటుకు అనుసంధానం చేసుకోవాలని అన్నారు. ఫారం–7కు సంబంధించి పదివేల మందికి పైగా నోటీసులు పంపామని తెలిపారు. దీనిలో కొత్తపట్నం తహశీల్దార్ రమణారావు, డీటీ అర్జున్‌రెడ్డి, ఓఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఒంగోలు డీటీ రఫీ, టీపీవో శివప్రసాద్, వైఎస్‌ఆర్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు స్వరూప్, రాజశేఖర్, సత్యం, రసూల్, రమేష్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


