
మట్టిగణపతి విగ్రహాన్ని నా చేతులతో తయారుచేయడం ఆనందంగా ఉంది. ఇది ఎనలేని తృప్తిని కలిగించింది. మట్టి గణపతి విగ్రహాన్ని పూజించడం ద్వారా పర్యావరణానికి ఎంతోమేలు చేశామన్న ఆనందం కలిగింది.
– డి.గాయత్రి, మొదటి బహుమతి విజేత
పర్యావరణంపై ప్రతి ఒక్కరికీ అవగాహన
పర్యావరణంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం అనే విధానానికి హ్యాట్సాఫ్. చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారి మంచి ఆక్సిజన్‌ను సమాజానికి ఎలా అందిస్తుందో అలాగే చిన్నతనం నుంచే పర్యావరణంపై అవగాహన కల్పిస్తే ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణాన్ని మేము రూపొందించుకుంటామన్న నమ్మకం మాకు కలిగింది.
– కె.జ్వాలా స్వరూప
మట్టి గణపతి ఎంతో మేలు
మట్టి గణపతి ఎంతో మేలు. నా చేతులతో తయారు చేసిన విగ్రహాన్ని పండుగ రోజు పూజించుకోవాలన్న ఆలోచన సంతోషాన్ని కలిగిస్తోంది. రసాయనాలతో చేసిన విగ్రహాలు చూసేందుకు అందంగా ఉన్నా అవి ప్రకృతికి చేసే హాని ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మట్టిగణపతిని పూజించాలి.
– పి.కృతిక, ప్రథమ బహుమతి విజేత

