కారు, ట్రాక్టరు ఢీ

● ఒకరు మృతి, 8 మందికి గాయాలు
పొదిలి రూరల్: పొదిలి మండలం మాదాలవారిపాలెం సమీపంలో శుక్రవారం రాత్రి బొలెరో వాహనం, ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. తొమ్మిది మంది భక్తులు శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకుని కారులో చైన్నె వెళ్తూ.. పొగాకు బేళ్లను తరలిస్తున్న ట్రాక్ట్రరును ఢీకొట్టారు. కారులో ఉన్న అశోక్‌వర్థన్‌లాల్ అనే వ్యక్తి మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.