ఆదోని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్‌సీపీ | YSRCP Wins No Confidence Motion Against Adoni Municipal Chairperson, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆదోని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్‌సీపీ

Apr 16 2025 3:16 PM | Updated on Apr 16 2025 3:49 PM

Ysrcp Wins No Confidence Motion Against Adoni Municipal Chairperson

సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ నెగించుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంత వంటెద్దు పోకడలకు వ్యతిరేకిస్తూ, వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ చైర్మన్‌పై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు.

కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్‌ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంతకు వ్యతిరేకంగా 35 కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ నెగ్గించుకుంది.

 కాగా, ‘‘వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదన్నారు. వార్డుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీలో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదు.’’ అని 11, 12 వార్డుల కౌన్సిలర్‌ వాసీం అన్నారు. నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్‌ సమక్షంలో తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఆయన నిన్న(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్‌రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చానన్నారు. 2029లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

అవిశ్వాసం తీర్మానం పెట్టిన YSRCP కౌన్సిలర్లు

Advertisement
 
Advertisement
Advertisement