‘నియంత పాలనకు..చంద్రబాబు సర్కారుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయ్‌’ | Ysrcp Tjr Sudhakar Babu Fires On Chandrababu Over Red Book Constitution In Ap | Sakshi
Sakshi News home page

‘నియంత పాలనకు..చంద్రబాబు సర్కారుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయ్‌’

Nov 26 2024 2:23 PM | Updated on Nov 26 2024 3:33 PM

Ysrcp Tjr Sudhakar Babu Fires On Chandrababu Over Red Book Constitution In Ap

సాక్షి,తాడేపల్లి : సాక్షి,తాడేపల్లి : నియంతలు,నీరోల పాలనకు చంద్రబాబు పాలనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   

  • ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కును మన రాజ్యాంగం కల్పించింది
  • పాలకులు రాచరికపు పోకడలు పోవటానికి వీల్లేదు
  • కానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారా?
  • ప్రజల ప్రాథమిక హక్కులన్నిటినీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు
  • అలాంటి చంద్రబాబుకు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపకునే హక్కు లేదు
  • రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే చంద్రబాబుకు పాలనకు అనర్హుడు
  • చెప్పినట్టు కేసులు పెట్టించకపోతే మంత్రి పదవిలో నుండి దిగిపోవాలని మంత్రి అనితని పవన్ కళ్యాణ్ అన్నారు
  • ఇదేనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే తీరు?
  • నియంతలు, నీరోల పాలనకు చంద్రబాబు సర్కారుకు దగ్గరి పోలికలు ఉన్నాయి
  • దళిత నేత నందిగం సురేష్ ను అన్యాయంగా జైలుపాల్జేశారు
  • దళిత నాయకత్వాన్ని చంపేసే కుట్ర చంద్రబాబు చేస్తున్నారు
  • వైఎస్‌ జగన్ దళితులకు అందించిన సంక్షేమాన్ని నిలిపేసిన చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు
  • చిన్నారులపై అత్యాచారాలు చేసి చంపేస్తుంటే చంద్రబాబు దోషులను ఎందుకు అరెస్టు చేయనీయటం లేదు?
  • జగన్‌పై నిత్యం విషం చిమ్మటానికే చంద్రబాబు పని చేస్తున్నారు
  • చంద్రబాబు గెలుపులో ఏదో తేడా ఉందని అందరికీ అర్థం అవుతోంది
  • ఈవిఎంలలో తేడా వలనే గెలిచారని ప్రజలు అంటున్నారు
  • భారీ సీట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియా కార్యకర్తలను చూస్తే భయమెందుకు?
  • ఇలాంటి నాయకులను రీకాల్ చేసే పరిస్థితులు రావాలి
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 108, 104, ఇతర అనేక కార్యక్రమాలను ఆపేసిన చంద్రబాబుకు రాజ్యాంగాన్ని అమలు చేసే హక్కు లేదు
  • ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు లేదు
  • అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి
  • ఇక్కడ ఈవీఎంలతో ఎందుకు జరుపుతున్నారు?
  • రాజ్యాంగ పరిరక్షణకు అందరం నడుము బిగించాల్సిన సమయం వచ్చింది
  •  కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోము’  అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు స్పష్టం చేశారు. 
సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆగని వేధింపులు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement