చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan call to Puja in Temples in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు: వైఎస్‌ జగన్‌

Sep 26 2024 5:37 AM | Updated on Sep 26 2024 7:57 AM

YSRCP President YS Jagan call to Puja in Temples in Andhra Pradesh

చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న ఆలయాల్లో పూజలు 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపు 

సాక్షి, అమరావతి: తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు, ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ఈ నెల 28న (శనివారం) ప్రత్యేక పూజలు చేయాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. 

ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.  తిరుమల పవిత్రతను, వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విశిష్టతను, స్వామి వారి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారని అన్నారు. 

కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారంనాడు ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement