టీడీపీ భరత్‌, పల్లా.. మిమ్మల్ని ప్రజలు క్షమించరు: ఎంపీ విజయసాయిరెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Serious On TDP Leaders Over Visaka Steel Plant | Sakshi
Sakshi News home page

టీడీపీ భరత్‌, పల్లా.. మిమ్మల్ని ప్రజలు క్షమించరు: ఎంపీ విజయసాయిరెడ్డి

Sep 13 2024 5:32 PM | Updated on Sep 13 2024 5:39 PM

YSRCP MP Vijaya Sai Reddy Serious On TDP Leaders Over Visaka Steel Plant

సాక్షి, ఢిల్లీ: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో​ గంటా శ్రీనివాసరావును మాదిరిగానే విశాఖ టీడీపీ ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తాజాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను 2024 జనవరిలో స్పీకర్‌ ఆమోదించారు. అప్పటి గంటా శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత వైజాగ్‌ పార్లమెంటు సభ్యుడు భరత్‌ మతుకుమల్లి, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలి. వారు అలా రాజీనామా చేయకపోయినా, ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోయినా చరిత్ర వారిని ద్రోహులుగా, మోసగాళ్లుగా పరిగణిస్తుంది. ప్రజలు వారిద్దరినీ క్షమించరు. వారు చేసిన ద్రోహానికి వారిద్దరికీ గట్టి గుణపాఠం జనం చెబుతారు అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 

అయితే, నిన్న కూడా స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి కొట్టుకుపోయినట్టే. ఈ సంక్షోభం సమయంలో ఆయన మౌనం ఎన్డీయే కేంద్రప్రభుత్వానికి ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగా భావించవచ్చు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టే. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్ లో ఎగిసి పడిన ఒక ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) ఇక ఛిద్రమైనట్టే. చంద్రబాబు మోసాన్ని, కాపాడే శక్తి ఉన్నా నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు. టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

 

 ఇది కూడా చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏలేరు వరదలు: వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement