‘డీఎస్సీలో అక్రమాలు నిజం’ | YSRCP MLC Chandra Sekhar Reddy Slams AP Govt Over DSC | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీలో అక్రమాలు నిజం’

Jun 5 2026 10:40 PM | Updated on Jun 5 2026 10:40 PM

YSRCP MLC Chandra Sekhar Reddy Slams AP Govt Over DSC

తాడేపల్లి : ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగింది నిజమేననడానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోవడం డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడానికి నిదర్శమన్నారు. అసలు తమ ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. 

ఈరోజు(శుక్రవారం, జూన్‌ 5వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘డీఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్ధులకు అన్యాయం జరిగింది. విద్యా శాఖ ఉన్నతాధికారులు అసత్యాలు మాట్లాడుతున్నారు. కాల్ లెటర్స్ 1:1 రేషియోలో పంపాము అంటున్నారు. అసలు దానికి అర్థం ఏంటి..?, వారి మాటలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్ యధాతథంగా అమలు చేయాలి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వారిని హారిజాంటల్ రిజర్వేషన్ లో ఇచ్చాం అంటున్నారు. 

ఏ కేటగిరీలో స్పోర్ట్స్ కోటా వాళ్ళు వస్తారో మీకు తెలియదా ?, స్పోర్ట్స్ కోటాలో కొందరికి ఇవ్వటానికి పిలిచిన వాళ్లలో కొంతమందిని బలిచేసినట్లుగా కనిపిస్తుంది. మీరు చెప్పిన విధంగా ఎక్కడా జరగదు. మీరు చేసింది కరెక్టేనా అనేది పునః సమీక్ష చేసుకోవాలి. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ విధానంలో చేయని విధంగా మీరు చేశారు. మీరు సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయనిది వాస్తవమా.. కాదా ?, 

కొన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానాలు కూడా చెప్పలేక పోతున్నారు. టీచర్, డాక్టర్ పోస్టులు ఇష్టం వచ్చినట్లు ఇవ్వటం కుదరదు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. దాన్ని వైలెట్ చేయడానికి లేదు. ఆర్డర్స్ తయారు చేసిన వాళ్లు, అమలు చేసిన వాళ్లు కోర్టులకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. డీఎస్సీ, టెట్ రాయకుండా.. బీఎడ్, డీఎడ్ చదవకుండా వారికి ఎలా పోస్ట్స్ ఇస్తారు. శాప్ ధృవీకరణ ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?, క్వాలిఫై అయిన కొందరు అభ్యర్థులతో మా పార్టీ వారిని తిట్టిస్తున్నారు. అన్యాయం అయినవారి పట్ల సానుభూతి చూపించాలి..

పోస్టులు అమ్ముకున్న ఉదంతాలపై విచారణ చేపట్టాలి. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన అభ్యర్థికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. సెల్ఫ్ డిక్లరేషన్ రాయటం రాని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. సర్టిఫికెట్స్ అప్లోడ్ కాని వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?, ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement