గుంటూరు వెస్ట్: జిల్లా వ్యాప్తంగా 1,048 పాఠశాలలు, ఐదు ప్రభుత్వ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విజయవంతంగా సాగిందని శుక్రవారం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ప్రజా ప్రతినిధులు వారి పరిధిలో కార్యక్రమ విశిష్టతను తెలియజేశారని పేర్కొన్నారు. అధికారులు కూడా విద్యాసంస్కరణలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు వంటి అంశాలు వివరించారని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక, లీప్ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయి తెలుసుకొనే విధానం, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా విద్యార్థుల చదువు తీరు తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు.
జిల్లా కలెక్టర్
సీఎం సాయికాంత్ వర్మ


