తల్లి తోడు.. వందనం ఇస్తే ఒట్టు | - | Sakshi
Sakshi News home page

తల్లి తోడు.. వందనం ఇస్తే ఒట్టు

Jul 25 2026 1:47 AM | Updated on Jul 25 2026 1:47 AM

శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026

డ్వాక్రా రుణాలకు సాయం నగదును

లింకు పెడుతున్న బ్యాంకర్లు

బలవంతంగా డబ్బు లాగేసుకోవడంపై

తల్లుల ఆవేదన

మెగా పీటీఎంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే

బూర్లకు బాధిత మహిళల ఫిర్యాదు

శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026

రిజిస్ట్రేషన్‌ పనులు యథాతఽథం

గుంటూరు వెస్ట్‌: జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయని గుంటూరు సబ్‌ రిజిస్ట్రార్‌–1 ఎం.షరీల్‌ బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ దస్తావేజు లేఖరుల నిరసనలో భాగంగా కార్యాలయాల్లో పనులు జరగడం లేదని ప్రజలు భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచనల మేరకు సేవలు యథాతథంగా పొందవచ్చని తెలిపారు. సమాచారం కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోనే హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. దస్తావేజు లేఖరులు ప్రజలను ఆటంక పరచవద్దని కోరారు. వారు కూడా సమ్మె విరమించి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. సమావేశంలో సబ్‌ రిజిస్ట్రార్లు ముప్పాళ్ళ వెంకటేశ్వరరావు, ఎ. గోపాల్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

ప్రత్తిపాడు: ఒక చేత్తో తల్లికి వందనం అంటూ బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తూ.. మరో చేత్తో డ్వాక్రా అప్పుల పేరుతో నగదు విత్‌ డ్రా చేసుకోనివ్వకుండా చంద్రబాబు సర్కారు మోకాలడ్డుతోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా అప్పులకూ, తల్లికి వందనం నిధులకు ముడి పెడుతూ ప్రభుత్వం ఆటలాడుతోంది. దీంతో తమ ఖాతాల్లో నగదు పడిందని డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వెళుతున్న మహిళలకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రత్తిపాడుకు చెందిన కీర్తన, ఆరోగ్యమాత గ్రూపులకు చెందిన కొందరు మహిళలు తమ వ్యక్తిగత ఖాతాల్లో జమ అయిన తల్లికి వందనం డబ్బులు తీసుకునేందుకు స్థానికంగా ఉన్న యూనియన్‌ బ్యాంకుకు వెళ్లారు. ‘సభ్యులు సక్రమంగా రుణం చెల్లించకపోవడం వలన వ్యక్తిగత ఖాతా ఫ్రీజ్‌ చేయబడింది.. డబ్బులు డ్రా చేసుకోవడం కుదరదు. ఓవర్‌ డ్రాఫ్ట్‌, డీఫాల్ట్‌లో ఉంది...’ అంటూ బ్యాంకర్లు రకారకాల కారణాలు చెప్పారు. దీంతో వారు శుక్రవారం ప్రత్తిపాడు భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌కు హాజరైన ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు సమస్యను చెప్పారు. ‘మీరేమో తల్లికి వందనం డబ్బులు చదువులకే వినియోగించాలని అంటున్నారు.. కానీ బ్యాంకు వాళ్లేమో మా డ్వాక్రా అప్పులకు ఆ డబ్బులకు ముడిపెట్టి ఇబ్బందులు పెడుతున్నారంటూ’ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆటోమేటిక్‌గా అకౌంట్లు ఫ్రీజ్‌..

దీంతో ఎమ్మెల్యే ప్రత్తిపాడులోని యూనియన్‌ బ్యాంకుకు వెళ్లారు. తల్లికి వందనం డబ్బులు మహిళలకు ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని బ్యాంకు మేనేజర్‌ ఎం. సురేష్‌ను ప్రశ్నించారు. ఎవ్వరికీ డబ్బులు ఆపలేదని, ఆటోమేటిక్‌గా ఫ్రీజ్‌ అయ్యాయని మేనేజర్‌ చెప్పారు. ఉన్నతాధికారులకు లేఖ రాసి ఫ్రీజింగ్‌ తొలగించాలని కోరుతామని మేనేజర్‌ చెప్పారు. అసహనానికి గురైన ఎమ్మెల్యే ఎల్‌డీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement