గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురిని వివిధ పదవుల్లో నియమిస్తూ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కొప్పుల విజయ మాధవిని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదేవిధంగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన దారా హేమప్రసాద్‌ను జిల్లా వలంటీర్స్ విభాగ అధ్యక్షుడిగా నియమించారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సయ్యద్ బషీద్ – జిల్లా మైనార్టీ విభాగ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, సూదాతులసి కుమారి – జిల్లా మహిళ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. నగర మహిళ విభాగం ఉపాధ్యక్షురాలిగా వజ్రాల విజయమేరి, ప్రధాన కార్యదర్శిగా ఎర్రంరెడ్డి రమణ, కార్యదర్శులుగా రామిశెట్టి జోత్న్స, దాళవాయి సౌజన్య, వి.ఈశ్వరమ్మబాయి, నగర మహిళ విభాగం కార్యనిర్వాహక సభ్యులుగా షేక్ ఫాతిమా, కె.వి.ఆదిత్య, ఆకుల వసుంధర, ఉల్లంగుల విజయరాజ్యం, అలికేపల్లి అనూరాధ నియమితులయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడిగా కుండేరు విజయదీపక్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడిగా నల్లక వెంకటరమణ, పశ్చిమ నియోజకవర్గ ఉద్యోగ, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా పాలేటి సుందరరావు, పశ్చిమ నియోజకవర్గ చేతివృత్తుల విభాగం అధ్యక్షుడిగా రాజవరపు మురహరిరావు నియమితులయ్యారు.


