‘పవన్‌.. ఈ ప్రశ్నలకు డైరెక్టుగా బదులివ్వు’ | YSRCP Leaders Questions To DCM Pawan Kalyan Over Women Security In AP, More Details Inside | Sakshi
Sakshi News home page

‘పవన్‌.. ఈ ప్రశ్నలకు డైరెక్టుగా బదులివ్వు’

Published Mon, Nov 4 2024 9:28 PM | Last Updated on Tue, Nov 5 2024 10:52 AM

ysrcp leaders questions to dcm pawan kalyan women security in ap

గుంటూరు, సాక్షి: రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఫెయిల్‌ అయ్యారని డీప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  అన్నారు. ఇక.. తానే హోం శాఖ  మంత్రినైతే పరిస్థితి ఇలా ఉండేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.  హోం మంత్రి అనిత మాత్రమే ఫెయిలా? మొత్తం ప్రభుత్వానిది కాదా?. అసలు మహిళల భద్రతపై పవన్‌  కల్యాణ్‌ ఏ రోజైనా మాట్లాడారా?. 

ఒకవేళ మాట్లాడినా.. సీఎం చంద్రబాబు వినలేదా?. ఏపీలో చంద్రబాబు పాలన అట్టర్‌ ఫ్లాప్‌ అని పవన్‌ కల్యాణ్‌ తన వ్యాఖ్యల ద్వారా ఒప్పుకున్నట్లేనా?. పవన్ ప్రశ్నించాలంటే ఎవరిని ప్రశ్నించాలి?. ఆయన బాబును  ప్రశ్నించాలి.. అయితే ఆ హక్కు పవన్‌కు ఉందా? అని వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీస్తున్నారు.  అదేవిధంగా పవన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. 

పవన్‌ ఈ ప్రశ్నలకు డైరెక్టుగా బదులివ్వు..

1.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని వైఎస్‌ జగన్‌ నాలుగు నెలల నుంచి అడగలేదా.. ఢిల్లీ వేదికగా ధర్నాలు చేయలేదా.

2.. హత్యాచారాలు అరికట్టడంలో హోంశాఖ ఫెయిలైతే అది కెబినెట్‌ సమిష్టి బాధ్యత కాదా.. దీనికి చంద్రబాబు బాధ్యుడు కాదా.

3..  లా అండ్‌ ఆర్డర్‌ అదుపు తప్పితే అది  సీఏంగా చంద్రబాబు ఫెయిల్యూర్‌ కాదా.. మరి  ఆయన్ను ఎందుకు ప్రశ్నించరు.

4.. మహిళలపై 80​కిపైగా  హత్యాచారాలు జరిగితే ఏనాడైనా ఒక్క కుటుంబాన్ని పరామర్శించారా.. వారికి భరోసా కల్పించారా.

5.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని, అమాయకుల్ని నరికిచంపుతుంటే .. జగన్‌ ప్రశ్నించారు.. మీరు  ఏనాడైనా నోరు మెదిపారా.. 

6.. పరిస్థితి చేయిదాటిపోయిందని ప్రజలు నుంచి తిరుగుబాబు తప్పదనే భయంతో మీరిలా మాట్లాడుతున్నది నిజం కాదా..

7.. నాలుగు నెలల్లో చేయాల్సిన తప్పులిన్నీ చేసి.. ఆ పాపంలో నువ్వు భాగస్వామివి కాదన్నట్లు చేతులు దులుపుకునే ప్లాన్‌ చేశావా..

8.. హోంశాఖ ఫెయిలైందని ఒక్క మంత్రివర్గ సమావేశంలో.. ఒక్కసారైనా సీఎంకు చెప్పావా.. చెప్పినా బాబు  పట్టించుకోలేదా..

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement