‘అభివృద్ధి మాది... డప్పు కూటమి ప్రభుత్వానిది’ | YSRCP Leader Mutyala Naidu Slams Chandrababu, Accuses Coalition Government Of Taking Credit For YSRCP Schemes | Sakshi
Sakshi News home page

‘అభివృద్ధి మాది... డప్పు కూటమి ప్రభుత్వానిది’

Aug 23 2026 6:44 PM | Updated on Aug 23 2026 6:58 PM

YSRCP Leader Mutyala Naidu  Takes On Chandrababu Sarkar

అనకాపల్లి: సీఎం చంద్రబాబు మాడుగుల పర్యటన వలన ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ నేత బూడి ముత్యాల నాయుడు  విమర్శించారు. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అభివృధ్ధి తాము చేస్తే.. డప్పు మాత్రం కూటమి ప్రభుత్వం కొట్టుకుంటుందని మండిపడ్డారు.  నమ్మినవారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, వెన్నుపోటు పొడవడమే ఆయన రాజకీయమన్నారు. 

‘డిఎస్సీ అవకతవకలపై సీబిఐ విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ అంటే కూటమి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు. కూటమి పాలనలో గ్రామాలలో మద్యం ఏరులై పారుతుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం దుకాణాలను పరిమితం చేశాం. ఇప్పుడు గ్రామాలలో బెల్ట్ షాపులు  పెరిగాయి.వైఎస్సార్‌సీపీ గత పథకాలను కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది.రైతులపై టీడీపీ మొసలి కన్నీరు కురుస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement