మచిలీపట్నం జనసేనలో తారస్థాయికి విభేదాలు.. తన్నులాట.. | Internal Factional Feud Escalates in Machilipatnam janasena | Sakshi
Sakshi News home page

మచిలీపట్నం జనసేనలో తారస్థాయికి విభేదాలు.. తన్నులాట..

Aug 23 2026 5:21 PM | Updated on Aug 23 2026 5:36 PM

Internal Factional Feud Escalates in Machilipatnam janasena

కృష్ణా జిల్లా: మచిలీపట్నం జనసేనలో విభేదాలు తారస్థాయికి చేరాయి. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారు జనసేన నాయకులు. మచిలీపట్నం 8వ డివిజన్ విశ్వబ్రాహ్మణ కాలనీలోని జనసేన నాయకుడి ఇంటి ఫంక్షన్ లో జనసేన నాయకుల మధ్య వాగ్వాదానికి దిగారు.

మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన సంభాషణలలో జనసేన నాయకుడు కొట్టే వెంకటరావుపై మచిలీపట్నం జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు దాడి చేశారు. రెండుగా విడిపోయిన జనసేన పార్టీ నేతల వల్ల అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తనపై దాడి ఘటనలో జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని కొట్టే వెంకటరావు వర్గీయులు డిమాండ్ చేశారు.  

జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజుపై కొట్టే వెంకట్రావు వర్గీయులు దాడికి యత్నించారు. వివాదం పెద్దదవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితులను సద్దుమణిగించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసులు సమక్షంలోనే గడ్డం రాజుపై దాడి చేయడానికిన కొట్టే వెంకట్రావు వర్గీయులు యత్నించారు. పరిస్థితి అదుపుతప్పడంతో జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజును పోలీసులు వేరొక ప్రాంతానికి తరలించారు. 

ఇదీ చదవండి: మార్గదర్శి బకాయిలను రామోజీ వారసులే చెల్లించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement