‘బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది చంద్రబాబే’ | YSRCP Leader Gorantla Madhav Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘రిజ‌ర్వేష‌న్లు 24 శాతానికి త‌గ్గ‌డానికి చంద్ర‌బాబే కార‌ణం’

Oct 9 2026 6:27 PM | Updated on Oct 9 2026 6:49 PM

YSRCP Leader Gorantla Madhav Slams Chandrababu

తాడేపల్లి:  చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ప్ర‌కాశం జిల్లా కొండ‌పిలో జ‌రిగిన స‌భ‌లో బీసీల రిజర్వేషన్ల అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పచ్చి అబద్ధాలతో బురదజల్లే ప్ర‌య‌త్నం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆ తర్వాత వైఎస్‌ జగన్ ప్రభుత్వాల‌దేనని స్పష్టం చేశారు. 

కానీ చంద్రబాబు తన మనిషి బిర్రు ప్రతాప్‌రెడ్డి తో కోర్టులో పిటిషన్‌ వేయించి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారని, ఫలితంగా రిజర్వేషన్లు 24.15 శాతానికి పరిమితమయ్యాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనూ వైఎస్సార్సీపీపై నిందలు వేయడం మానకుండా, బీసీలను ఎన్నికల కోసం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్ట సవరణ చేయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తారో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

చంద్ర‌బాబు సీఎం కాక‌మునుపే 34 శాతం రిజ‌ర్వేష‌న్లు
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు పచ్చి అబద్ధాలు ప్ర‌చారం చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడు. 1995లో తానే 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చానని, వైఎస్సార్సీపీయే వాటిని తగ్గించిందని ఆయన మాట్లాడటం సిగ్గుచేటు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉండగా, ఫిబ్రవరి 3 నాడే ఆ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే, సెప్టెంబర్ 1న సీఎం అయిన చంద్రబాబు ఆ ఘనత తనదే అని చెప్పుకోవడం ఆయనకే చెల్లుతుంది. 

స్థానిక సంస్థల్లో బీసీలకు కనీసం 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టంలో చేసిన సవరణను నాడు ఉమ్మడి రాష్ట్రంలో 1995, ఫిబ్రవరి 3న గవర్నర్‌ ఆమోదించారు. 1994, డిసెంబరు 30 నుంచి ఆ రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని అందులో స్పష్టంగా ప్రకటించారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తొలి ఏడాదిలోనే జీఓ నెం:176 ద్వారా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే, చంద్రబాబే తన మనిషి బిర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా పిటిషన్ వేయించి వాటిని అడ్డుకున్నాడు. హైకోర్టు తీర్పు కారణంగా ఆనాడు రిజర్వేషన్లు 24.15 శాతానికి పడిపోవడానికి పూర్తిగా చంద్రబాబే కారణం.  

నీకు నిజంగా BCలపై ప్రేమ ఉంటే... బాబుని ఇచ్చిపడేసిన గోరంట్ల మాధవ్

హైకోర్టు కొట్టేస్తే వైఎస్సార్సీపీపై నెపం
ఆయ‌న జారీ చేసిన జీవో నెం:105, 1065లను హైకోర్టు కొట్టివేస్తే ఆ నెపాన్ని కూడా వైఎస్సార్సీపీ పై నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈరోజు హైకోర్టులో చంద్రబాబు జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది న్యాయవాది తాండవ యోగేష్ స్వయంగా పార్టీ–ఇన్‌–పర్సన్‌గా హాజరై వాదనలు వినిపించారు, దీనికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు పెట్టాలని మాత్రమే వైఎస్సార్సీపీ కోర్టును ఆశ్రయించింది తప్ప రిజర్వేషన్లను అడ్డుకోలేదు. 

వైఎస్సార్సీపీ ఎప్పుడూ బీసీల పక్షమే ఉంటుంది కాబట్టి వారికి రాజకీయ, సామాజిక సాధికారత కల్పించింది మా ప్రభుత్వమే. చంద్రబాబుకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయన వెంటనే కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయించాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ డిమాండ్ చేశారు

ఇదీ చదవండి: బాబు పాలనంతా అబద్ధాలు.. ప్రచారాలు.. నాటకాలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement