అమ్మానాన్నల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వంతో అమెజాన్ ఉద్యోగం సాధించా. కళాశాల యాజమాన్యం ప్లేస్‌మెంట్లకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఉపయోగపడింది. ఈ తరహా ఉద్యోగాలు సాధించాలనుకునేవారు డేటా స్ట్రక్చర్స్‌పై ఎక్కువ దృష్టి పెడితే ఉపయోగం ఉంటుంది. నాన్న బత్తినేని రాజేష్ వ్యాపారం చేస్తుంటారు. అమ్మ గృహిణి. కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నాను. అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఇంటర్న్‌గా ఎంపికయ్యాను.
– బత్తినేని వర్ష,
సీఎస్‌ఈ, పట్టాభిపురం, గుంటూరు


