పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత

నగరంపాలెం: జిల్లాలోని పొన్నూరు మున్సిపాలిటి, మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్‌ అధికార, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ కెమెరాల నిఘా, పటిష్ట భద్రత కల్పించామని తెలిపారు. ఓట్ల లెక్కింపు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కేంద్రాల పరిసరాల్లో పోలీస్‌ నిఘా, గస్తీ కొనసాగించాలని ఆదేశించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్ట్యా పెదకాకాని, తెనాలి రూరల్‌, కొల్లిపర, పొన్నూరు రూరల్‌, చేబ్రోలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇప్పటి నుంచి ముందస్తు ప్రణాళికతో ఉండాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలని అన్నారు. రూట్‌ మొబైల్స్‌ ఏర్పాటు, పటిష్ట పోలీస్‌ బందోబస్త్‌ సిద్ధమవ్వాలని చెప్పారు.

ఐదు మండలాల పరిధిలో మైకుల వినియోగం, బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇతర ప్రచారాలకు అనుమతుల్లేవని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ అమలు దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల వేళ ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు. ఎక్కడైనా అనుమానిత కార్యకలాపాలు లేదా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే పోలీస్‌ అధికారులకు లేదా డయల్‌ 112కు సమాచారం అందించాలని చెప్పారు.

ఎస్పీ వకుల్‌ జిందల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement