సద్దుగడప: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌పై జనసేన ఎమ్మెల్యే నాయకర్ దాడికి పాల్పడ్డారు.ఇంటికి పిలిపించుకుని మరీ దాడి దిగారి నాయకర్.
వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గెలవడంతో నిన్న గ్రామంలో సంబరాలు జరిగాయి. ఇది తట్టుకోలేని జనసేన కార్యకర్తలు బొమ్మిడి నాయకర్‌కు ఫిర్యాదు చేయించారు. దాంతో సదరు సర్పంచ్‌ను ఇంటికి పిలిపించారు నాయకర్.
ఈ క్రమంలోనే సంబరాలు చేసుకున్నారంట కదా.. అంటూ నాయకర్.. సర్పంచ్‌ను నిలదీశాడు. అదే సమయంలో సర్పంచ్ చెంపపై కొట్టాడు బొమ్మిడి నాయకర్. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గెలిచిన సర్పంచ్‌ను ఇంటికి పిలిపించి ఎమ్మెల్యే కొడతారా అంటూ మహిళలు ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: బాబు సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయింది: ధర్మాన


