‘ చంద్రబాబు.. మళ్ళీ అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన చేశారు’ | YSRCP Leader Buggana Takes On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘ చంద్రబాబు.. మళ్ళీ అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన చేశారు’

Jun 24 2025 6:20 PM | Updated on Jun 24 2025 7:33 PM

YSRCP Leader Buggana Takes On Chandrababu Govt

తాడేపల్లి : ఏపీఎండీసీ తన ఖనిజ సంపదను మరోసారి తాకట్టుపెట్టిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేందరనాథ్‌రెడ్డి స్సష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఈరోజు(మంగళవారం, జూన్‌ 24వ తేదీ) రూ. 5,500 కోట్లు అప్పు చేయడానికి వెళ్లిందనే విషయానని ఆయన తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపైపై బుగ్గన ధ్వజమెత్తారు. ‘

ఆస్తులనుగానీ, మద్యం ఆదాయాన్నిగానీ తాకట్టు పెట్టటం లేదని చంద్రబాబు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తున్నదేంటి?, అప్పు చెల్లించకపోతే నేరుగా రాష్ట్ర ఖజానా నుండే తీసుకునేలా అప్పుల వారికి అధికారం కట్టబెట్టారు.  అసెంబ్లీ ఆమోదం ఉంటే తప్ప నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తప్పుడు పనులు చేస్తున్నారు. 

ఈ వ్యవహారం కోర్టులో ఉన్నా మళ్ళీ అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన చేశారు. లక్షా 91 వేల కోట్ల విలువైన 436 గనులను యధేచ్చగా తాకట్టు పెట్టేశారు. ప్రయివేటు పార్టీకి వెసులుబాటు కల్పించడం దారుణం. మా హయాంలో అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక, వెనుజుల అవుతోందంటూ విష ప్రచారం చేశారు. 

మా హయాంలో 13% అప్పులు చేస్తే చంద్రబాబు హయాంలో 27% అప్పులు చేస్తున్నారు. మరి అప్పుడు మాట్లాడిన  వారంతా ఇప్పుడు ఏమయ్యారు?, చేసిన అప్పులన్నీ ఏమవుతున్నాయి?, పోలవరం నిర్మాణానికి వచ్చిన రూ. 5,052 కోట్లు ఏం చేశారు?, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారు. పర్యావరణ అనుమతులు సహా అనేక క్లియరెన్సులు వారే తెచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  

రాజకీయాలలో రివేంజులు కాదు, రియలైజేషన్ ఉండాలి. అంతేకానీ ప్రతిరోజూ అక్రమ కేసులు పెట్టుకుంటూ వెళ్లటం సరికాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చంద్రబాబు అప్పులు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించటం లేదు?, రాజధాని నిర్మాణానికి అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీని వేశారు. రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాల సేకరణ చేశారు. కానీ ఆయన రిపోర్టును పక్కనపెట్టి 1500 ఎకరాల్లో రాజధాని కడతామని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత 35 వేల ఎకరాలను సేకరించారు. అసలు రాజధాని కట్టాలనుకుంటున్నారా? నగరాన్ని నిర్మించాలనుకుంటున్నారా?, పచ్చని పొలాలను పాడు చేస్తున్నారు’ అని బుగ్గన మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement