లోటస్‌పాండ్‌లో వైఎస్‌ షర్మిల దీక్ష విరమణ

Ys Sharmila Hunger Strike Withdrawn In Lotus Pond - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గజ్వేల్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై నిరసనగా ఉదయం నుంచి లోటస్ పాండ్‌లో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగించిన షర్మిలకు గజ్వేల్‌ ప్రజలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

కాగా, వైఎస్‌ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్‌పూర్‌ మండలంలోని తీగుల్‌ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు.

పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు తనను అడ్డుకున్న పోలీసులకు హారతిచ్చి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ షర్మిల మండిపడ్డారు. దళితబంధులో అవకతవకలు జరిగాయని ఆమె ధ్వజమెత్తారు.
చదవండి: తెలంగాణలో బీజేపీ దూకుడు.. ప్లాన్‌ ఫలించేనా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top