‘బలిదానాలతోనే తెలంగాణ’ | Ys Sharmila Fires Cm Kcr Paadha Yatra Bhadradri | Sakshi
Sakshi News home page

‘బలిదానాలతోనే తెలంగాణ’

Apr 22 2022 5:34 AM | Updated on Apr 22 2022 5:36 AM

Ys Sharmila Fires Cm Kcr Paadha Yatra Bhadradri - Sakshi

సాక్షి,బూర్గంపాడు(భద్రాద్రి): వందల మంది ప్రాణత్యాగం..వేల మంది ఆస్తుల త్యాగంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ కుటుంబంలో ఎంతమంది ప్రాణత్యాగం చేశారో చెప్పాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కొనసాగింది.

జిన్నెగట్టు గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వివిధ గ్రామాల్లో సాగింది. ఉప్పుసాక గ్రామంలో జరిగిన రైతుగోస సభలో షర్మిల మాట్లాడుతూ..ఉద్యమ సమయం నుంచి నేటి వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటూ అధికారాన్ని అనుభవిస్తోందని, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్‌ పాదాల కింద నలిగిపోతోందని ఆరోపించారు. రాజన్న బిడ్డగా ఆశీర్వదిస్తే తిరిగి రాష్ట్రంలో వైఎస్సార్‌ పాలన తీసుకొస్తామన్నారు. దీక్షలో వైఎస్సార్‌ టీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్‌ గడిపల్లి కవిత, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement