సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోకస్ పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఇవాళ(మంగళవారం) సమీక్ష చేపట్టారు. వాటి పరిధిలోని నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, పలు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు హాజరయ్యారు.

ఇదీ చదవండి: నాడు గెలిచింది బాబు కాదు.. జగనే


