మావిగన్‌పై మరోసారి వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు | YS Jagan Key Comments On Mavigun Amaravati | Sakshi
Sakshi News home page

మావిగన్‌పై మరోసారి వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

Apr 8 2026 1:26 PM | Updated on Apr 8 2026 3:09 PM

YS Jagan Key Comments On Mavigun Amaravati

సాక్షి, తాడేపల్లి: రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్‌ భేటీలో మావిగన్‌ ప్రతిపాదనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. 

చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోంది. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోంది. కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే ఈ అమరావతి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేం రాజధాని వస్తుందని చెప్పాం. రాజధాని బెస్ట్‌ ఆప్షన్‌గా ప్లాన్‌ ఏ కింద.. విశాఖపట్నంను చెప్పాం. న్యాయ రాజధానిగా కర్నూల్‌ను చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా చెప్పాం. అదీ వద్దనుకుంటే ప్లాన్‌ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్‌ను మావిగన్‌(MAVIGUN)ను సూచించాం. 

అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులులో అందులో 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్‌లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చు. కానీ, చంద్రబాబు మావిగన్‌ను వద్దంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పే ఆ అమరావతి.. అతిపెద్ద దోపిడీ గని కాబట్టి. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో పైవ్‌స్టార్‌ చదరపు అడుగుకు రూ.4,500 మాత్రమే. కానీ, అమరావతిలో మాత్రం రూ.14,000 కట్టబెడుతున్నారు. దీనిని దోపిడీ కాక మరేమంటారు? అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

బాబుకు ప్రతి రోజూ సినిమా చూపిస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు

 

 

Advertisement
 
Advertisement
Advertisement