
సాక్షి, గుంటూరు: టీడీపీ మహిళా కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న సూఫియాను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సూఫియా మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు ఓ టీడీపీ మహిళా నేతకు మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవం. ఆ మహిళా నేత భర్త నవీన్ కృష్ణే నాకు చెప్పాడు’’ అంటూ సూఫియా చెప్పుకొచ్చింది.
‘‘నేను నా భార్యను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దగ్గరకు తీసుకువెళ్లే వాడినని నవీన్ కృష్ణ నాకు చెప్పాడు. నవీన్ కృష్ణ తన భార్య ఫోన్‌ను హ్యాక్ చేశాడు. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుకునే కాల్స్ అన్ని భర్త నవీన్ కృష్ణ వింటూ ఉండేవాడు. తన భార్యకు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు సంబంధించిన వీడియోలు ఆమె భర్త నవీన్ కృష్ణ దగ్గర ఉన్నాయి. నేను నసీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి ఆమె భర్త దగ్గర మీ వీడియోలు ఉన్నాయని చెప్పాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నసీర్ బెదిరించాడు. ఇప్పుడు వాళ్లందరూ ఏకమై ఈ వ్యవహారాన్ని నాపై నెడుతున్నారు.
..పోలీసులు మా కుటుంబ సభ్యుల్ని తరచూ పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించి ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే అన్ని వీడియోలు బయటకు వస్తాయి. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో నవీన్ కృష్ణ బయటికి విడుదల చేశాడు. నవీన్ కృష్ణ, ఆయన భార్య వాళ్ల బంధువు విజయ్ కృష్ణను అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని సూఫియా పేర్కొంది.