breaking news
Guntur East Assembly Constituency
-
ఎమ్మెల్యే నసీర్‌కు, ఆ టీడీపీ మహిళా నేతకి మధ్య ఎఫైర్: సూఫియా
సాక్షి, గుంటూరు: టీడీపీ మహిళా కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న సూఫియాను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సూఫియా మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు ఓ టీడీపీ మహిళా నేతకు మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవం. ఆ మహిళా నేత భర్త నవీన్ కృష్ణే నాకు చెప్పాడు’’ అంటూ సూఫియా చెప్పుకొచ్చింది.‘‘నేను నా భార్యను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దగ్గరకు తీసుకువెళ్లే వాడినని నవీన్ కృష్ణ నాకు చెప్పాడు. నవీన్ కృష్ణ తన భార్య ఫోన్‌ను హ్యాక్ చేశాడు. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుకునే కాల్స్ అన్ని భర్త నవీన్ కృష్ణ వింటూ ఉండేవాడు. తన భార్యకు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు సంబంధించిన వీడియోలు ఆమె భర్త నవీన్ కృష్ణ దగ్గర ఉన్నాయి. నేను నసీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి ఆమె భర్త దగ్గర మీ వీడియోలు ఉన్నాయని చెప్పాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నసీర్ బెదిరించాడు. ఇప్పుడు వాళ్లందరూ ఏకమై ఈ వ్యవహారాన్ని నాపై నెడుతున్నారు...పోలీసులు మా కుటుంబ సభ్యుల్ని తరచూ పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించి ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే అన్ని వీడియోలు బయటకు వస్తాయి. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో నవీన్ కృష్ణ బయటికి విడుదల చేశాడు. నవీన్ కృష్ణ, ఆయన భార్య వాళ్ల బంధువు విజయ్ కృష్ణను అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని సూఫియా పేర్కొంది. -
నాకు చెప్పకుండా ఎలా వస్తావ్..?.. గుంటూరు ఈస్ట్ టీడీపీలో వర్గపోరు
సాక్షి, గుంటూరు: నగరంలోని ఈస్ట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బయటపడింది. ఆర్టీసీ కాలనీలో లోకేష్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరు కాగా, తనకు చెప్పకుండా మా డివిజన్‌లోకి ఎలా వస్తారంటూ ఎమ్మెల్యేను డివిజన్ పార్టీ అధ్యక్షుడు యాసిన్ అడ్డుకున్నారు.ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు యాసిన్ వర్గీయులు వార్నింగ్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై యాసీన్ వర్గీయులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.తంబళ్లపల్లె టీడీపీలో..కాగా, తంబళ్లపల్లె టీడీపీలో ఇప్పటికే వర్గపోరు నడుస్తుండగా.. లోకేష్ బర్త్‌డేతో అది రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, సీఎం అంటూ లోకేష్‌పై సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిచ్చును మరింత రాజేశాయి. ఈ క్రమంలో నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఉన్న ఫ్లెక్సీలను చించిపాడేసింది మరో వర్గం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోగా.. కేసు నమోదైంది.తంబళ్లపల్లె టీడీపీలో మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్సెస్ ఇంఛార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తోంది. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆకర్షించే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బుధవారం రాత్రి శంకర్ వర్గీయులు పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శంకర్ ప్రధాన అనుచరుడు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో.. ఇంఛార్జి జైచంద్రారెడ్డి విడిగా తన అనుచరులతో లోకేష్ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.అందులో శంకర్‌కు చోటు లేకుండా చూసుకున్నారు కూడా!. అయితే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. చంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది చంద్రారెడ్డి వర్గీయుల పనిగా పురుషోత్తం అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. -
షర్మిల వాడిన భాష, యాస సరికాదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు. కాగా, సజ్జల ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘షర్మిల వాడిన భాష, యాస సరికాదు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిబద్ధతతో పనిచేస్తున్నారు. వైఎస్సార్ వారసుడిగా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసింది. సీఎం వైఎస్ జగన్‌పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్సే. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు?. షర్మిల.. తెలంగాణ నుంచి ఏపీకి హఠాత్తుగా ఎందుకొచ్చారు. ఆ పార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు?. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదు?. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు?. ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడే. అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుంది. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది.. టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. చంద్రబాబుతో కుమ్మకై ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదాను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్చలో పెట్టలేదు. దీనిపై షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే. చంద్రబాబు తన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైఎస్ జగన్ రాజీ పడరు. కేంద్రంతో సఖ్యతగా ఉండి సీఎం జగన్ రాష్ట్రానికి మేలు చేస్తున్నారు. చివరగా వైఎస్సార్ తనయురాలిగా, వైఎస్ జగన్ చెల్లెలిగా షర్మిలను అభిమానిస్తాం’ అని చెప్పుకొచ్చారు.